ఏడేళ్లుగా ప్రేమ.. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే. మరో అమ్మాయితో..

27 Dec, 2021 12:42 IST|Sakshi
వెంకటేశ్‌ ఇంట్లో బైఠాయించిన లక్ష్మి 

సాక్షి, ఆదిలాబాద్‌: పెంబి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కుభీర్‌ మండల కేంద్రానికి చెందిన లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి చేసుకోవాలని అడుగడంతో ముఖం చాటేశారు. ఆదివారం వెంకటేశ్‌ ఇంట్లో లక్ష్మి బైఠాయించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని తెలిపాడని, అంతేకాకుండా శారీరకంగా లొంగదీసుకుని తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడని తెలిపింది.

మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని, రెండేళ్ల క్రితం కుభీర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు, దస్తురాబాద్‌ ఎస్సై జ్యోతిమయి ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని, ఇంట్లో చొరబడి బైఠాయించడం సరికాదని చెప్పి ఇంటికి పంపించారు. 
చదవండి: మొయినాబాద్‌ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య

పెళ్లి చేసుకోవాలని భర్త తమ్ముడి వేధింపులు. వివాహిత ఆత్మహత్య
కడెం:
మండలంలోని అల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడ గ్రామానికి చెందిన మసే జ్యోతి(40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వివరాల ప్రకారం.. జ్యోతిని భర్త తమ్ముడు సునీల్‌ కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతి ఈ నెల 25న ఉదయం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతు శనివారం రాత్రి మృతిచెందింది. భర్త ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవు   పేర్కొన్నారు. 
చదవండి: జూబ్లీహిల్స్‌: స్నేహితురాలి వెంటపడి వేధించి, అసభ్యంగా ప్రవర్తించి
 

మరిన్ని వార్తలు