పంజగుట్ట: మేనేజర్‌ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని..

19 May, 2022 10:20 IST|Sakshi

సాక్షి, పంజగుట్ట: యువతి కనిపించకుండా పోయిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చాంద్రాయణగుట్ట ఇబ్రహీం మజ్జిద్‌ సమీపంలో నివసించే ఉజ్మా బేగం(22) పంజగుట్టలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఆఫీస్‌ మేనేజర్‌కు కొద్దిగా డబ్బులు కావాలని అడిగింది.

మేనేజర్‌ ఏటీఎం కార్డు ఇచ్చి డ్రా చేసుకోవాలన్నాడు. ద్వారకాపూరి కాలనీ సాయిబాబా ఆలయం వద్ద ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని సహోద్యోగికి కార్డు ఇచ్చి మేనేజర్‌కు ఇవ్వా­లని వెళ్లిపోయింది. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆఫీస్‌లో చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితంలేదు. ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. దీంతో బుధవారం ఆమె తల్లి నజ్మాబేగం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది 

మరిన్ని వార్తలు