ఆదాయ వనరులైనందునే అపచారాలు

9 Jan, 2018 01:12 IST|Sakshi

సీఎం చంద్రబాబుకు మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు లేఖ 

సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయ వనరులుగా భావిస్తున్నాయని, ఆదాయ మార్గాల అన్వేషణలో ఆలయాల్లో అనేక అపచారాలు జరుగుతున్నాయని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. విజయవాడ తాంత్రిక పూజల నేపథ్యంలో ఆయన సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆదాయం కోసం వివిధ రకాల పూజల పేరుతో ఎక్కువ ధరలు వసూలు చేస్తుండటంతో సాధారణ భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారని పేర్కొన్నారు.

ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల హిందూ ధార్మిక సంస్థల సంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతింటోందని లేఖలో పేర్కొన్నారు. ఇసుక కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి వంటి వారు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యాడని, అలాంటి వ్యక్తులు పలువురు టీటీడీ చైర్మన్లుగా ఉన్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయ శాఖలో సిబ్బందిని నియమిస్తుడటం వల్ల ఇతర మతస్తులు కూడా ఈ శాఖలో ఉద్యోగం పొందుతున్నారని ఐవైఆర్‌ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ, ఆలయాల్లో పనిచేసే సిబ్బంది నియామకానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు