ప్రమాదాల హైవే...

31 May, 2014 00:04 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పొందుగల నుంచి పిడుగురాళ్ళ వరకు 37 కి.మీ విస్తరించి ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే రక్తమోడుతోంది. ప్రతి ఐదు రోజులకో ప్రమాదం చొప్పున ఈ ఐదు నెలల్లో 25 ప్రమాదాలు జరిగాయి. 28 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైవేపై వాహనాలకు వేగపరిమితి లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.
 
 ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాల్లో యజమానులు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హైవే మీదకు వస్తే ఇంటికి తిరిగి వెళ్లేంతవరకూ మనిషి ప్రాణానికి హామీ లేకుండా పోతోంది. ప్రభుత్వం హైవేపై నిర్దిష్టమైన నియమ నిబంధనలు ప్రవేశపెట్టి వేగ నియంత్రణ చేయని పక్షంలో ఈ ప్రాంతంలో ప్రయాణికుల బతుకులకు భద్రత కరువే.
 
 దాచేపల్లి,న్యూస్‌లైన్: అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఐదురోజులకొకసారి ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నా యి. నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కళ్లుమూసి కళ్లు తెరిచే లోపే ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెల ప్రారంభం నుంచి మే 30 వరకు ఐదు నెలల కాలంలో హైవేపై దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి పిడుగురాళ్ల మధ్య 25కు  పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
 
 ఈ ప్రమాదాల్లో 28 మంది మృ త్యువాత పడగా మరో 15మంది తీవ్రగాయాల పాలయ్యారు. హైవేలో వెళ్లే వాహనాలు అతివేగంతో వెళ్లడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే ఆథారిటీ పోలీ సులు, స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యి.
 
 దాచేపల్లి మండలం పొందు గల గ్రామం నుంచి పిడుగురాళ్ల వరకు సుమారుగా 37 కిలోమీటర్ల పొడవునా హై వే రహదారి విస్తరించి ఉం ది. ఈ రహదారిపై ఈ ఏడా ది జనవరి నెల ప్రారంభం నుంచి పోలీ సుల రికార్డుల ప్రకారం పరిశీలిస్తే ప్రతి ఐదు రోజుల కొకసారి రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. జనవరి నెలలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆటో నిబంధనల ప్రకారం వెళ్తున్నా లారీ మితిమీరిన వేగంతో రావడం వలన ఈ ప్రమా దం సంభవించింది. ఫిబ్రవరిలో  శ్రీనగర్‌లో రోడ్డు వెంట నడుస్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది.

మార్చిలో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే ఇలాంటి సం ఘటనలు ఎన్నో జరిగాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తులను, రో డ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులను లారీలు ఢీకొనడం వంటి సంఘటనలు హైవేపై తరచుగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఒక లారీని మరో లారీ ఢీకొనడం..ఆటోలను, ద్విచక్రవాహనాలను లారీలు ఢీకొనడం లాంటి సంఘటనలు జరిగి ప్రజలు మృత్యుకౌగిట్లో చిక్కుకుంటున్నారు.
 
 ప్రమాదాలకు నిలయం ఈ ప్రదేశాలు.: హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మండలంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద, శ్రీనగర్, దాచేపల్లి బస్టాండ్ సెంటర్, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద  జరుగుతున్నాయి. శ్రీనగర్ గ్రామం హైవే రోడ్డును ఆనుకుని సుమారుగా కిలోమీటర్‌కు పైగా ఉంటుంది. హైవే నిర్మాణం సమయంలో గ్రామంలో పెడస్ట్రల్ అండర్ ప్రాసెస్ (పీయూపీ)ని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో తమకు పీయూపీ అవసరం లేదని గ్రామస్తులు చెప్పారు. దీంతో నిర్మాణాన్ని ఆపివేసి రోడ్డును మాత్రమే నిర్మించారు.
 
 దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాచేపల్లి బస్టాండ్ సెంటర్‌లో జనం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో లారీలు మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దాచేపల్లి నుంచి ముత్యాలంపాడు రోడ్డు వద్ద కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ పీయూపీ నిర్మాణం చేపట్టిన తరువాత ముత్యాలంపాడులో వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెప్పడంతో 20 మీటర్ల పీయూపీని తొలగించారు.
 
 గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వస్తుండటం వలన ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. పీయూపీ పల్లంలో ఉండడం వలన ఇక్కడ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. ముత్యాలంపాడు నుంచి వచ్చే వాహనాలు హైవేపై వచ్చే వాహనాలకు కనిపించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణపల్లి వద్ద కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
 మితిమీరిన వేగంతో వాహనాలు.: హైవేలో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి.
 
 రోడ్డులో ఎక్కడా స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడం, రో డ్డు సాఫీగా ఉండడంతో వాహనాల వేగానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. లారీలు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వె ళ్తుండగా, కారులు 100 నుంచి 120 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. బస్సులు కూడా 90 కిలోమీటర్లకు తగ్గకుండా వెళ్తున్నాయి. వాహనాల వేగానికి కళ్లెం వేసి నియంత్రించినట్లయితే రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు నిత్యం గస్తీ తిరుగుతూ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు