అగ్రి గోల్డ్ డిపాజిటర్ల ఆందోళన

4 May, 2015 13:04 IST|Sakshi

విజయవాడ: గడువు ముగిసినా డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించక పోవడంతో ఆగ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళకు దిగారు. ఆగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన డబ్బుని ఇప్పించి తమకు న్యాయం చేయాలంటూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యలయం ముందు ధర్నా చేశారు.

  అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసిన వారిలో ఎక్కువ మంది పేదలు కావడంతో కష్టపడి పోగేసిన డబ్బులు ఎక్కడ దక్కకుండా పోతాయోనని భయపడిపోతున్నారు.

మరిన్ని వార్తలు