రూ.1000 కోట్ల ఫండ్ ఇవ్వండి

25 May, 2016 19:26 IST|Sakshi

అగ్రిగోల్డ్ ఖాతాదారుల డిమాండ్
జూన్ 15న హాయ్‌ల్యాండ్ వద్ద భారీ ప్రదర్శన


విజయవాడ: అగ్రిగోల్డ్ ఖాతాదారుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే రూ. వెయ్యి కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమాన్‌పేటలో నిర్వహించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫండ్ ఏర్పాటు చేసి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు సర్దుబాటు చేయడం ద్వారా ఆత్మహత్యలు నివారించాలని కోరారు.

సీఐడీ వద్ద ఉన్న ఖాతాదారుల జాబితాను ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విచారణను వేగవంతం చేయాలని కోరారు. ప్రతినెలా రూ. వెయ్యి నుంచి రెండువేల కోట్ల ఆస్తులు వేలం వేసిన సొమ్మును కొద్దిమొత్తాల్లో బాధితుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కేసు విచారణ, ఆస్తుల వేలం పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. అగ్రిగోల్డ్‌లో పనిచేసి ఉపాధి కోల్పోయిన అర్హత కలిగిన వారందరికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని డిమాండ్ చేశారు. జూన్14లోగా ప్రభుత్వం స్పందించి ఫండ్ ఏర్పాటు చేయకపోతే మరుసటి రోజే (జూన్ 15న) హ్యాయ్‌లాండ్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అసోసియేషన్ సహాయ కార్యదర్శి విశ్వనాథరెడ్డి,జిల్లాల నుంచి వచ్చిన ఖాతాదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు