బ్రిజేష్కుమార్ తీర్పుపై అఖిలపక్ష భేటీ

30 Nov, 2013 17:01 IST|Sakshi

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అఖిలపక్ష భేటి నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. బ్రిజేష్‌కుమార్ తీర్పుపై ప్రభుత్వం సరిగా స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. శనివారం ఉదయం జరగాల్సిన సుదర్శన్ రెడ్డి ప్రెస్మీట్ వాయిదా పడింది. కృష్ణా మిగులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు