గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు 

29 Sep, 2019 08:30 IST|Sakshi

అక్టోబర్‌ నుంచి గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు 

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ముందుకు వస్తున్న ఎయిర్‌లైన్స్‌

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పెరుగుతున్న సర్వీసులు

 విశాఖ, హైదరాబాద్‌కు రెండు చొప్పున కొత్త సర్వీసులు 

ఎయిర్‌పోర్టు (గన్నవరం): గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరులో కొత్తగా విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్‌లతో పాటు హైదరాబాద్‌కు అదనంగా రెండు సర్వీస్‌లను ఎయిర్‌లైన్స్‌ సంస్థలు నడపనున్నాయి. రెండు నెలలుగా వైజాగ్‌కు విమాన సర్వీస్‌లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పైస్‌జెట్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌ ముందుకువచ్చాయి. 

అలయెన్స్‌ ఎయిర్‌ అక్టోబర్‌ ఒకటి నుంచి హైదరాబాద్‌ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌కు సర్వీస్‌లు నడపనుంది. 70 సీట్ల సామర్థ్యం కలిగిన  విమానం హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్‌కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్‌ చేరుకునే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

స్పైస్‌ జెట్‌ వైజాగ్‌ సర్వీస్‌..
స్పైస్‌జెట్‌ సంస్థ అక్టోబర్‌ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్‌లను ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్‌ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్‌కు చేరుకుంటుందని స్పైస్‌జెట్‌ ప్రతినిధులు తెలిపారు. 

హైదరాబాద్‌కు ఇండిగో నాలుగో సర్వీస్‌..
ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్‌– విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి రోజుకు మూడు విమాన సర్వీస్‌లను ఆ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. నాలుగో సర్వీస్‌ కింద అక్టోబరు 27 నుంచి 74 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్‌ విమానం హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 6.35కు బయలుదేరి 7.35కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు ఇక్కడి నుంచి బయలుదేరి 21.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకునే విధంగా షెడ్యూల్‌ ప్రకటించారు. ఇటీవల రద్దయిన న్యూఢిల్లీ సర్వీస్‌ను కూడా పునరుద్ధరించే దిశగా ఇండిగో సన్నాహాలు చేస్తోంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం

మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..

బెంబేలెత్తుతున్న రైల్వే ప్రయాణికులు..

కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..

రాజకీయాలకు అతీతంగా  పేదలకు స్థలాలు, ఇళ్లు 

నగర రూపురేఖలు మారుస్తాం 

ఆ ‘ పిచ్చితల్లి’ శిశువును సాకేదెట్టా..

మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!

అమ్మో.. జ్వరం

జీఓ నంబర్‌ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దిగి వచ్చిన ఉల్లి..

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

10న అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం

ఓర్వలేకే విమర్శలు

శ్రీస్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బలిరెడ్డికి సీఎం జగన్‌ ఘన నివాళి 

శ్రీశైలానికి తగ్గిన వరద

ముగ్గురమ్మల ముచ్చట

మద్యం.. తగ్గుముఖం

మద్య నిషేధంలో మహిళల భాగస్వామ్యం

‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు 

రేపు నాసా యాత్రకు వెళ్తున్న భాష్యం ఐఐటీ విద్యార్థిని

ఏపీ టూరిజం ఎక్సలెన్స్‌ అవార్డులు ప్రదానం

30న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రేపటి నుంచి ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట

'ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా కల నెరవేరింది : చిరు

అతిథే ఆవిరి అయితే?

అబ్బే... నేను హాట్‌ కాదు