మరో తుపాను గండం..

7 Nov, 2014 02:47 IST|Sakshi

 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాకు మరో తుపాను గండం పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం  హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.  జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. ముఖ్యంగా పూసపాటిరేగ, భోగాపురం తీరప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు.   ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు.   కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే విధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను సందర్భంగా ఉత్పన్నమయ్యే సమస్యలను టోల్‌ఫ్రీ నంబర్ 1077కు గానీ, కంట్రోల్ రూమ్ నంబర్ 08922-278770కు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఙప్తి చేశారు.   విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో  08922-276888,  పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం 08963-221006 నంబర్లకు కూడా సమాచారం తెలియజేయవచ్చని తెలిపారు. అన్ని  తహశీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.  
 

>
మరిన్ని వార్తలు