రాయచోటిపై సీఎం జగన్‌ వరాల జల్లు

24 Dec, 2019 16:02 IST|Sakshi

రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తాం

కృష్ణా, గోదావరి జలాలు తరలిస్తాం

ప్రాజెక్టులు నిండాలి.. రైతులు సుభిక్షంగా ఉండాలి

రాయచోటి బహిరంగ సభలో సీఎం జగన్‌

సాక్షి, వైఎస్సార్‌ : కృష్ణా, గోదావరి జలాలతో వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని కడప జిల్లా రాయచోటి, చిత్తూరు జిల్లాకు తరలిస్తామని సీఎం తెలిపారు. కనీసం సాగు,తాగు నీరు కూడా అందుబాటులో లేని రాయచోటి ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మం‍గళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు కడప జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశాయని విమర్శించారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిధులు మంజూరు చేయమని అడిగితే.. పార్టీ మారాలని అన్నారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన మాటకు కట్టుబడి రాయచోటిని అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. ఆరునెలల కూడా కాకముందే రెండువేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. (అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నారు)


బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘తాగు, సాగు నీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గం రాయచోటి. రాయలసీమలో ఈ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉంది. దివంగత నేత వైఎస్సార్‌ను అత్యంత అభిమానించే ప్రాంత కూడా రాయచోటి. గతంలో కనీసం నీరు లేకపోవడంతో వైఎస్సార్‌ వెలగల్ల రిజర్వాయర్‌ నిర్మించారు. ఈ ప్రాంతానికి రింగురోడ్డు కూడా నిర్మించారు. ఆయన మరణం తరువాత అభివృద్ధి కుంటుపడింది. గత పదేళ్లలో జరిగింది శూన్యం. మీ కృషి ఫలితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అభివృద్ధి ఫలాలు అందిస్తాం. నీటి కొరతను తీర్చేందుకు కాలేటివాగు రిజర్వాయర్‌ సామర్థ్యంను 1.2 టీఎంసీలకు పెంచుతాం. అక్కడి నుంచి నీటిని లక్కిరెడ్డి పల్లి, రామపురం మండలాలకు తరలిస్తాం. కృష్ణా నీటితో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం అవుతుంది. రాయచోటితోపాటు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా లబ్ధిపొందుతాయి. దీని కోసం 12వేల కోట్ల ఖర్చు చేస్తాం. (సీఎం జగన్‌ వేసే ప్రతీ అడుగు ప్రజలకోసమే..)

రాయచోటిలో తాగునీరు, కాలువలు, డ్రైనేజికి రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్థానికంగా ఉన్న 50 పడకల హాస్పిటల్‌ను 100 పడకలుగా మారుస్తాం. దీని కోసం రూ.23 కోట్లు కేటాయిస్తాం. గ్రామవార్డు, సచివాలయాల అభివృద్ధికి రూ.11 కోట్లు, సీసీరోడ్లకు రూ.11.55 కోట్లు. జిల్లాలో పోలీస్‌ కార్యాలయంకు రూ. 20 కోట్లు, డీఎస్‌పీ, పోలీస్‌ ఆఫీసులు నిర్మిస్తాం. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం.. రాయచోటి వక్ఫ్ బోర్డుకి సంబంధించి వివాదంగా ఉన్న నాలుగు ఎకరాల భూమిని ముస్లింలకు కేటాయిస్తాం.’ అని అన్నారు.గుంటూరు మీదుగా గోదావరి జలాలు..
శ్రీశైలంలో వరదలు వచ్చినవి. 800 టీఎంసీలు నీరు సముద్రంలో కలిశాయి. అయినా కూడా రాయలసీమ ప్రాజెక్టుల నిండలేదు. గండికోట సామర్థ్యం 23 టీఎంసీలు.. కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. చిత్రావతి 10 టీఎంసీలకు కేవలం ఆరు టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌ 17 టీఎంసీలకు కేవలం 8 మాత్రమే నింపగలిగాం. దానికి కారణం కాలువలు సరిగ్గాలేకపోవడం. వెడల్పు చేయకపోవడం. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్క్ష్యం చేశాయి. గత ప్రభుత్వం వీటిని పట్టించుకుని ఉండి ఉంటే నిండుకుండల్లా కనిపించేవి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల దశ, దిశ మారేవి. పోతిరెడ్డి పాడు, తెలుగుగంగా, సీసీ కేనాల్‌, గాలేరు నగరి సృజల శ్రవంతి సామర్ధ్యం పెంచుతాం. గోదావరి జలాలను గుంటూరు మీదుగా రాయలసీమకు తీసుకువచ్చే ప్రణాళిలకు తయారుచేస్తున్నాం. దీని కోసం 63 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం’ అని అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు