లాక్‌డౌన్‌: వలస కూలీలకు ‘రిలీఫ్‌’

2 Apr, 2020 09:29 IST|Sakshi
రిలీఫ్‌ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వలస కూలీలు  

జిల్లాలో 63 నిరాశ్రయ కేంద్రాల ఏర్పాటు 

3,328 మందికి ఆశ్రయం  

కర్నూలు(సెంట్రల్‌): బతుకుదెరువు కోసం జిల్లాకు వలస వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలకు విశ్రాంతి కేంద్రాలు ఊరట ఇస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లే వీల్లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలస కూలీల కోసం రిలీఫ్‌ (నిరాశ్రయ) కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలో 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 3,328 మంది ఆశ్రయం పొందుతున్నారు. రిలీఫ్‌ కేంద్రాల్లో వలస కూలీలు ఉండేందుకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం కలి్పంచింది.

అంతేకాక జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు వడ్డించే మెనూ ప్రకారం భోజన వసతి కలి్పంచారు. జిల్లాలోని రిలీఫ్‌ కేంద్రాల్లో జార్ఖండ్‌కు చెందిన 817 మంది, బీహార్‌ 561, ఉత్తరప్రదేశ్‌ 259, మధ్యప్రదేశ్‌ 118, కర్ణాటక 74, రాజస్థాన్‌ 58, అస్సాం 34, తమిళనాడు 34, ఢిల్లీ 31, తెలంగాణ 24, చత్తీస్‌ఘడ్‌ 17, గుజరాత్‌ 9, పంజాబ్‌ 8, కేరళ 5, అరుణాచల్‌ ప్రదేశ్‌ 3, ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక్కరు ఆశ్రయం పొందుతున్నారు.  

మరిన్ని వార్తలు