ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

21 Jul, 2018 07:39 IST|Sakshi
మాట్లాడుతున్న శ్రీరాములుగౌడ్‌

బనగానపల్లెరూరల్‌: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విద్యార్థి, యువజన జేఏసీ బనగానపల్లె కన్వీనర్‌ శ్రీరాములుగౌడ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములుగౌడ్‌ మాట్లాడుతూ విభజన సమయంలో అప్పటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, అయితే అధికారంలోనికి వచ్చాక ప్రత్యేక హోదా అంశం మాట్లాడక పోవడం బాధాకరమన్నారు.

బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్న టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ నుంచి బయటికి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాటుతున్నట్లు నాటకలాడడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయడంతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలనిడిమాండ్‌ చేశారు. జేఏసీ కో–కన్వీనర్‌ కారుమంచి, నాయకులు ధనుంజయ, నాగరాముడు, రాజు, రవితేజ, బడేసాహేబ్‌ పాల్గొన్నారు.
 
బనగానపల్లె : పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదా బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి శివయ్య,  ఏఐటీయూసీ నాయ కులు బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పెట్రోల్‌ బంక్‌ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను నేరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎర్రబాషా, మండల సహాయ కార్యదర్శి శివయ్య, సీనియర్‌ నాయకులు సంజీవులు, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్‌ పెద్దమునెయ్య, ఏఐటీయూసీ నాయకులు అంజి, గబ్బర్‌సింగ్, మాలమహానాడు నాయకులు నాగరాజు, వెంకటస్వామి, అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల అసోసియేషన్‌ అ««ధ్యక్షులు ఎం రంగన్న యాదవ్‌  తదితరులు 
పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు