రాజధానిపై అధికారం రాష్ట్రానిదే : కిషన్‌రెడ్డి

6 Jan, 2020 20:27 IST|Sakshi

రాజధాని విషయంలో జోక్యం చేసుకోం

ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే స్పందిస్తాం : కిషన్‌రెడ్డి

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఏపీ రాజధాని విషయంలో తాము (బీజేపీ) జోక్యం చేసుకోమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన నివేదిక వస్తే కేంద్రం తరఫున స్పందిస్తామని అన్నారు. సోమవారం అనంతపురంలో కిషర్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై స్పందించారు. పార్టీ అభిప్రాయాలకు.. ప్రభుత్వ నిర్ణయాలకు చాలా తేడా ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఆకృత్యాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్పీసీ చట్టాలను మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. దాని కోసం అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ వేశామని చెప్పారు. కాలం మారినా.. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇప్పటికీ అమలవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిషత్తులో రూపొందించే చట్టాల కోసం అన్ని వర్గాల నుంచి సలహాలు స్వీకరిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు