ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డెరైక్టర్‌గా హనుమంతరావు

16 Aug, 2014 02:20 IST|Sakshi
ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డెరైక్టర్‌గా హనుమంతరావు
  •  చాన్‌‌సలర్‌కు సలహాదారుగా ఇబ్రహీంఖాన్
  • నూజివీడు : ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా ఆచార్య  కోసూరి హనుమంతరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేసిన ఆరేళ్ల తరువాత పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా, పరీక్షల విభాగం సమన్వయకర్తగా పనిచేస్తున్న హనుమంతరావును ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతలను ప్రస్తుత డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ నుంచి స్వీకరించారు.  ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించేందుకు కృషిచేస్తానన్నారు.

    ఛాన్సలర్ సలహాదారుగా ఇబ్రహీంఖాన్
     
    ఆరేళ్లపాటు నూజివీడు ట్రిపుల్ ఐటీ వ్యవస్థాపక డెరైక్టర్‌గా  పనిచేసిన ఇబ్రహీంఖాన్‌ను ఛాన్సలర్‌కు సలహాదారుగా నియమిస్తూ ఆర్జీయూకేటీ కులపతి  ప్రొఫెసర్  డీ రాజ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాకుండా బాసర ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ (ఈసీ) సభ్యులుగానూ నియమితులయ్యారు. సలహాదారుగా ఇబ్రహీంఖాన్ ప్రతి నెలా మూడు ట్రిపుల్ ఐటీలను సందర్శించనున్నారు.
     

>
మరిన్ని వార్తలు