వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

31 Aug, 2019 10:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని వారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కష్టకాలంలో ‘కానుక’

బయట తిరిగితే స్ప్రే చేస్తారు.. జాగ్రత్త

కోర్, బఫర్‌జోన్‌ పరిధిలోకి కడప

లాక్‌డౌన్‌: వలస కూలీలకు ‘రిలీఫ్‌’

బోర్డు మారింది.. ప్రస్థానం ముగిసింది 

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా