వ్యవసాయ కోర్సుల కౌన్సెలింగ్ ప్రారంభం

26 Sep, 2014 00:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ గురువారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. మొదటి రోజు 556 మందిని పిలువగా 147 మంది హాజరయ్యారు. రానివారు మెడిసిన్‌లో సీట్లు పొంది ఉండొచ్చని అధికారులు చెప్పారు. మొదటి సీటు 2501 ర్యాంకు పొందిన డి.ప్రణతీరెడ్డి వెటర్నరీ కళాశాలలో ప్రవేశం లభించింది. అలాగే 2551 ర్యాంకు సందీప్ భరద్వాజ్, 2561 ర్యాంకు రవిశంకర్‌రెడ్డిలు కూడా అదే కళాశాలలో సీట్లు పొందారు.

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ అధికారులు డాక్టర్ టి.వి.సత్యనారాయణ, డాక్టర్ టి.రమేష్‌బాబు, డాక్టర్ శివశంకర్, డాక్టర్ రావూరి రాఘవయ్య, డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌన్సెలింగ్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు