మహబూబ్పల్లిలో జంట దారుణ హత్య !

1 Feb, 2014 10:38 IST|Sakshi

మహముత్తారం మండలం మహబూబ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వసంత అనే మహిళను, సురేష్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. దాంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఆ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు