రెండో రోజుకు చేరిన రక్షణ రంగ ఉద్యోగుల సమ్మె

24 Jan, 2019 12:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధాలను వ్యతిరేకిస్తూ రక్షణ రంగ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. రక్షణ రంగ సంస్థల్లో ఎఫ్‌డీఐల అనుమతిని వ్యతిరేకించడంతోపాటు పాత పెన్షన్‌
విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు రక్షణ రంగ ఉద్యోగ సంఘాలకు చెందిన 3 ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి.  నావల్‌ డాక్‌ యార్డ్‌లోని విజయ్‌నగర్‌ గేట్‌ వద్ద ఉద్యోగులు, కార్మికులు మీటింగ్‌ ఏర్పాటుచేసుకుని నిరసన తెలుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ ఈ సమ్మెకు సంఘీభావం తెలిపింది. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేతలు కె.శ్రీనివాసరావు, విజయప్రకాష్‌, ఐఎన్‌సీఈ నేత బి.శ్రీనివాసరెడ్డి, ఎన్‌సీఆర్‌ యూనియన్‌ నేత పి.నాగేశ్వరరావు, సీఐటీయూ నేత జగ్గునాయుడు, ఆలిండియా డిఫెన్స్‌ ఎంప్లాయిస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ప్రతినిధి రెడ్డి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు