తప్పతాగి పాఠశాలలోనే పడక

9 Aug, 2018 13:15 IST|Sakshi
తప్పతాగి పాఠశాలలో పడి ఉన్న ఉపాధ్యాయుడు జార్జి విలియమ్స్‌, పాఠాలు చెప్పేవారు లేక ఆడుకుంటున్న విద్యార్థులు

ములకలాపల్లి ఉపాధ్యాయుడి నిర్వాకం

బోధనకు దూరమై ఆటలతో గడిపిన విద్యార్థులు

విశాఖపట్నం, రావికమతం (చోడవరం): విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వ్యసనానికి బానిసై పాఠశాలలోనే తప్పతాగి పడిపోతుండడంతో చిన్నారులు ఆటపాటలతో గడపాల్సి వస్తోంది.రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ ములకలాపల్లి గిరిజన గ్రామ పాఠశాలలో బుధవారం అక్కడి ఉపాధ్యాయుడు తప్పతాగి గదిలోనే పడిపోయాడు. మధ్యాహ్నం నుంచి అలాగే ఉండిపోయాడు. మాస్టారు ఎంతకూ లేవకపోవడంతో అక్కడి విద్యార్థులు తట్టిలేపినా ప్రయోజనం లేక ఆటలాడుతూ గడిపేశారు.

ఈ పాఠశాలలో 38 మంది విద్యార్థులున్నారు. అక్కడ జార్జి విలియమ్స్, సరిత అనే ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. సరిత సెలవులో ఉండగా జార్జి విలియమ్స్‌ మధ్యాహ్నం వరకు బోధన చేసి ఆపై ఫుల్‌గా మద్యం సేవించి వచ్చి పాఠశాలలోనే పడిపోయి తెలివిలేకుండా ఉన్నాడు. పిల్లలు ఆయన చుట్టూ చేరి సార్‌.. సార్‌ అంటూ ఎంతగా పిలిచినా లేవకపోవడంతో వారు చేసేది లేక ఆటల్లో  మునిగిపోయారు. ఈ ఉపాధ్యాయుడు తరచూ మద్యం మత్తులోనే ఉంటాడని.. పాఠశాలకు ఆలస్యంగా రావడం, ముందే వెళ్లిపోవడం చేస్తుంటాడని..   ఉపాధ్యాయులు లేక తమ పి         ల్లలు ఆటలాడుకుంటూనే గడిపేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నా రు. గిరిజన గ్రామం స్కూల్‌పై ఇంత నిర్లక్ష్యం చూపిస్తారా అంటూ   గ్రామస్తులు బొండా రాములు, చందర్రావు, పడాల్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

>
మరిన్ని వార్తలు