భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

12 Jun, 2017 13:26 IST|Sakshi

గుంటూరు క్రైం: రైతుల జీవితాలను నాశనం చేసే కల్తీ పత్తి విత్తనాలు పట్టుపడుతూనే ఉన్నాయి. గుంటూరు కేంద్రంగా పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు తయారవుతున్నా అధికారులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవటం లేదు. తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.

తాజాగా నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న మరో నలుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన కల్తీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు బస్టాండ్‌ సమీపంలో సోమవారం తనిఖీలు చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు ఓ దుకాణంలో నిల్వ ఉంచిన రూ. 3 లక్షల విలువైన కల్తీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు