మిలన్‌-2020కు ఆతిథ్యమివ్వనున్న తూర్పు నావికా దళం

3 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : భారత నావికా దళంలో డిసెంబర్‌ నాలుగవ తేదికి అత్యంత ప్రాధాన్యత ఉందని తూర్పు నావికా దళం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ పీసీ తెలిపారు. 1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నేవీ డే ను నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయ్యిందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు.  బుధవారం విశాఖ ఆర్‌కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సముద్ర మార్గం నుంచి శత్రు దేశాలు, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఆన్నాయనే ఇంటెలిజెన్స్‌ సమాచారంతో కోస్టల్‌ భద్రతను, పెట్రోలింగ్‌ను పటిష్టపరిచినట్లు తెలిపారు.  

విశాఖ తూర్పు నావికా దళంలో వచ్చే ఏడాది నుంచి మిగ్‌ 29 యుద్ద విమానాలు భాగస్వామ్యం కాబోతున్నాయని వెల్లడించారు. మిగ్‌ 29 యుద్ద విమానాల శిక్షణా కేంద్రం విశాఖలో ప్రారంభించబోతున్నామని, వచ్చే ఏడాది 30కి పైగా దేశాలు విశాఖలో జరిగే మిలన్‌-2020కి తూర్పు నావికా దళం ఆతిధ్యమివ్వబోతుండటం గర్వకారణమన్నారు. గత కొన్నేళ్లుగా అత్యాధునిక యుద్ద షిప్‌లు, విమానాలు, హెలీకాప్టర్లు, ఆయుధాలను ఇండియన్‌ నేవీ సమకూర్చుకోగలిగిందని  అతుల్‌ కుమార్‌ జైన్ తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: హోం మంత్రి

ఉల్లి ధరలపై సీఎం జగన్‌ సమీక్ష

క్యాన్సర్‌ రోగులకు పరి​మితులొద్దు..

వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌

దేశ తొలి రాష్ట్రపతికి సీఎం జగన్‌ నివాళి

ఏమైందో..ఏమో..! 

ఎస్సీ, ఎస్టీలకు వెలుగుల వరం!

స్త్రీలకు రెట్టింపు నిధి 

పట్టాలు తప్పిన షిరిడీ ఎక్స్‌ప్రెస్‌

టీడీపీ వర్గీయుల బరితెగింపు 

వరాహం కుక్కపిల్లలకు పాలిచ్చి వెళుతోంది..

మహా ప్రాణదీపం

గిరి వాకిట సిరులు!

‘వినాయక’ విడుదల ఎప్పుడు?

రేపు విశాఖ నగరానికి సీఎం జగన్‌ రాక

నేటి ముఖ్యాంశాలు..

రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు 

రహదార్ల మరమ్మతులకు రూ.450 కోట్లు 

దడ పుట్టిస్తోన్న అల్పపీడనం

పవన్‌ కులమతాలను రెచ్చగొడుతున్నారు

ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం

భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు 

బియ్యం నాణ్యతపై రాజీపడొద్దు

విద్యాభివృద్ధికి ఉన్నత ప్రణాళిక

సత్యలీలకు 'ఆసరా' తొలి చెక్కు

జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుచేస్తాం

ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట

మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు 

‘ఆసరా’తో ఆదుకుంటాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు

మా ప్రేమ పుట్టింది ముంబైలో

వెండితెరకు ద్యుతీ జీవితం