ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య

24 Aug, 2019 18:38 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో లెక్చరర్‌గా ఆమె పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో జగద్ధాత్రి పలు రచనలు చేశారు. కవితలు రాశారు. ప్రముఖ రచయిత, సన్నిహితుడు రామతీర్థ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు తెలుస్తోంది. మానసిక క్షోభతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు.

జగద్ధాత్రి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తోటి కవులతో స్నేహంగా ఉండేవారు. ఆమె మృతి పట్ల సాహిత్యలోకం, సోషల్‌ మీడియాలో సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. ‘జగద్దాత్రి అక్కా .. ఎంత పని చేశావ్ ..నిన్ను చూస్తుంటే ఎంత ధైర్యంగా ఉండేది.. దుఃఖం ఆగట్లేదక్కా’ అని ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరేట్‌.. జగద్ధాత్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు