రైతులను ఒత్తిడి చేయొద్దు

6 Jul, 2014 00:39 IST|Sakshi

 సాక్షి, ఏలూరు : రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు ఇవ్వడం ఆపాలని.. రెండు నెలల్లో రుణమాఫీపై స్పష్టత ఇస్తామని.. అంతవరకూ రైతులపై ఒత్తిడి చేయొద్దని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బ్యాంకర్లను కోరారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ సమక్షంలో స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత వివిధ శాఖల అధికారులతో  శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇసుక ర్యాం పుల విషయంలో పాటిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి
 
 ముఖ్యమంత్రి ఓ కమిటీని వేస్తున్నారని మంత్రి సుజాత తెలిపారు. ఈలోగా అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలన్నారు.  విత్తనాల కొరత ఉన్న ట్టు అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ సమస్య లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో ప్రతి గ్రామంలోనూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, గ్రామ పంచాయతీలు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
 
 పూర్తి స్థారుులో విద్యుత్ ఇవ్వండి
 వ్యవసాయానికి పూర్తి స్థాయిలో విద్యు త్ సరఫరా అందించాలని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కోరారు. జిల్లాలోని పరిస్థితిని ఈపీడీసీఎల్ సీఎండీకి కలెక్టర్, జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ వివరించాలన్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని ఏలూరు ఎంపీ మాగంటి బాబు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిని జిల్లా ఎంపీలతో సమీక్షించాలని, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మొగల్తూరు మండలం రైతులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కోరారు.
 
 ప్రత్యేకాధికారులెవరూ ఇప్పటివరకూ తమను కలవకపోవడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అన్ని పనులూ ‘ఆన్‌ప్రోసెస్’లో ఉన్నాయని నివేదికలో చూపుతున్నారని, వాస్తవ పరిస్థితిని చెప్పాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కాలువల్లో పూడిక పెరిగిపోయిందని, దానిని తొలగించుకోవడాని రైతులు సిద్ధంగా ఉన్నందున వారికే పనులు అప్పగించాలని ఎమ్మెల్యే బం డారు మాధవనాయుడు కోరారు. తాళ్లపూడికి రూ.8 కోట్లతో మంజూరైన తాగునీటి పథకం పనులను ఇప్పటివరకూ ప్రారంభించలేదని  కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్స్‌ను సక్రమంగా నిర్వహించడం లేదని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివ అన్నారు.
 
 బ్యాంకర్లకు చెప్పాం : కలెక్టర్
 కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ రుణాల వసూలు కోసం రైతులపై ఒత్తిడి చేయొద్దని బ్యాంకర్లకు ఇప్పటికే చెప్పామన్నారు. ఎంపీలు మాగంటి మురళీమోహన్, తోట సీతామహలక్ష్మి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు,  ఎమ్మె ల్సీ అంగర రామ్మోహన్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ నరసింగరావు, డీఆర్‌వో కె.ప్రభాకరరావు, వివి ధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు