జీహెచ్ఎంసీకి డబుల్ ధమాకా!!

26 Feb, 2014 10:18 IST|Sakshi
జీహెచ్ఎంసీకి డబుల్ ధమాకా!!

రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కూడా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎవరికి ఎలా ఉన్నా.. జీహెచ్ఎంసీకి మాత్రం భలే కలిసొస్తోంది. ఎందుకంటే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రానున్నాయి.

నగరంలోని సదుపాయాలను రెండు ప్రభుత్వాలూ ఉపయోగించుకుంటాయి కాబట్టి, తాము అదనపు బాధ్యతలను మోయాల్సి వస్తుందని, అందువల్ల రెండు ప్రభుత్వాల నుంచి నిధులు, గ్రాంటులు కోరుతామని మేయర్ మాజిద్ హుస్సేన్ చెబుతున్నారు.మొత్తం నగరంలోని 150 వార్డులనూ తాము అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకోసం కోర్ ఏరియా (ప్రధాన నగరం)లో ఒక్కో వార్డుకు కోటిన్నర రూపాయలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు. దీనికోసం తప్పనిసరిగా నిధుల అవసరం ఉంటుందని, వాటిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి తీసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు