బోటు నిర్వాహకుడిపై కేసు నమోదు 

16 Sep, 2019 12:38 IST|Sakshi

సాక్షి, దేవీపట్నం : నిబంధనలకు విరుద్ధంగా బోటు నడిపి.. ప్రమాదానికి కారణమైన ప్రయివేటు టూరిజానికి చెందిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటు నిర్వాహకుడు కోడిగుడ్ల వెంకటరమణపై దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. నిబంధనలు పాటించకుండా బోటు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం తహసీల్దార్‌ మహబూబ్‌అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిబంధల ప్రకారం బోటులో 60 మంది పర్యటకులతో పాటు 5 మంది సిబ్బంది ప్రయాణించాల్సి ఉండగా.. 71 మందికి పైగా  ప్రయాణిస్తున్నారు. బోటు తరిఖీ జరిగే దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ వద్దకు రాగానే  పర్యటకులు అందరూ లైఫ్‌జాకెట్లు ధరించి ఉన్నారు. స్టేషన్‌ దాటాక వాటిని తీసేశారు. ఇక్కడే సిబ్బంది పర్యాటకులను కట్టడిచేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని నిర్థారించారు. 

సంబంధిత కథనాలు :

నిండు గోదారిలో మృత్యు ఘోష

ముమ్మరంగా సహాయక చర్యలు

30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత

ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా