బోటు ప్రమాదం : 26 మృతదేహాలు లభ్యం

17 Sep, 2019 17:30 IST|Sakshi

సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. వాటిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 

(చదవండి :  మరో 14 మృతదేహాలు లభ్యం)

మృతుల వివరాలు
మూలవెంకట సీతారామరాజు(బాజీ జంక్షన్‌-విశాఖపట్నం), అబ్దుల్‌ సలీమ్‌ (బాపులపాడు మం. పీలేరు, కృష్ణా జిల్లా), బండ పుష్ప(విశాఖ, వేపకొండ), గన్నాబత్తుల బాపిరాజు(నరసాపురం, పశ్చిమగోదావరి), కుసాల పూర్ణ(గోపాలపురం, విశాఖ), మీసాల సుస్మిత(గోపాలపురం, విశాఖ), దుర్గం సుబ్రహ్మణ్యం(తిరుపతి), మధుపాడ రమణబాబు(మహారాణిపేట, విశాఖ), గడ్డమీద సునీల్‌( చినపెండ్యాల, జనగామ), బస్కి వెంకటయ్య(ఖాజీపేట, వరంగల్‌), పాశం తరుణ్‌కుమార్‌ రెడ్డి( రామడుగు, నల్లగొండ), వీరం సాయికుమార్‌(హైదరాబాద్‌), గొర్రె రాజేంద్రప్రసాద్‌(ఖాజీపేట, వరంగల్‌), రేపకూరి విష్ణు కుమార్‌ (నేలకొండపల్లి, ఖమ్మం), పాడి ధరణి కుమార్‌(హయత్‌నగర్‌, రంగారెడ్డి)

మరిన్ని వార్తలు