హాయ్... హ్యాపీ బర్త్ డే..!

16 Mar, 2016 00:10 IST|Sakshi

ఆరిలోవ : హ్యాపీ బర్త్ డే ఎవరికనుకుంటున్నారా? ఇంకెవరికి ఈ బుజ్జి తెల్లపులులకే...! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పుట్టినరోజు జరుపుకోవడం సాధారణమైన విషయం. కొందరైతే తమ ఇంట్లో పెంచుకొనే కుక్క పిల్లలకు సైతం పుట్టిన రోజు పండగ జరుపుతారు. మరి వన్యప్రాణులకు పుట్టినరోజు వేడుకలు ఎవరు జరుపుతారు? తెలుసుకోవాలంటే...! బుధవారం జూ పార్కుకు వెళ్లండి. అక్కడ తెల్ల పులులకు జూ అధికారులు పుట్టినరోజు వేడుక చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

జూలో శిరీష్(తండ్రి), కుమారి(తల్లి) అనే పేర్లుగల తెల్ల పులులు 12 ఏళ్లగా ఉన్నాయి. కుమారి 2010 మార్చిలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో పుట్టిన వెంటనే రెండు మరణించినా మిగిలిన మూడు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిలో రెండింటిని రెండేళ్ల క్రితం జీబ్రాలను ఇక్కడ తీసుకొచ్చినందుకు బదులుగా మలేసియా జూకి తరలించారు. మరోసారి కుమారి (తెల్లపులి) 2012 మార్చి 16న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో మూడు ఆడవి, ఒకటి మగది ఉన్నాయి. జూ అధికారులు వాటికి విజయ్, సోనా, బేతని, సావిత్రి అని పేర్లు పెట్టారు. వాటిలో సావిత్రిని ఖఢ్గమృగం తీసుకొచ్చిందుకు బదులుగా కాన్పూర్ తరలించారు. మిగిలిన మూడింటికి ఐదేళ్లు పూర్తి కావడంతో జూ అధికారులు జూలో వాటి ఎన్‌క్లోజర్ ఆవరణలో బుధవారం పుట్టినరోజు వేడుక జరపనున్నారు. వినడానికి వింతగా ఉన్నా జూ అధికారులు మాత్రం మొదటిసారిగా జంతువులకు పుట్టినరోజు పండగ చేయడం విశేషం. అయితే మనం జన్మదినోత్సవాలు జరుపుకొని విందూ వినోదాలు పెట్టినట్లు అక్కడ భోజనాలూ..అవీ ఉండవండోయ్.. సరదాగా చూసి రావడానికైతే వెళ్లండి.. గిఫ్టులూ.. అవీ.. తీసుకెళ్లక్కరలేదండోయ్..
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారంతా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లారు: కలెక్టర్‌

ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమీక్ష 

‘అందువల్లే కరోనా కేసులు పెరిగాయి’

సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్‌

ఆంక్షల్లేకుండా పింఛన్లు

సినిమా

బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం

రణ్‌బీర్‌ మా ఇంటికొచ్చి ఆఫర్‌ ఇచ్చాడు

పలు సంస్థలకు గ్లోబల్‌ జంట విరాళాలు

స‌న్నీలియోన్ డ్యాన్స్‌కు పిల్ల‌ల కేరింత‌లు

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!