అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. రాజధానిలో హైటెన్షన్

17 Sep, 2018 09:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : అసైన్డ్‌ భూముల రైతులు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముట్టడికి పిలుపున్వివటంతో అమరావతిలో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి రైతులు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్‌ భూముల రైతులకు అన్యాయం చేస్తోందని అసైన్డ్‌ భూముల రైతులు ఆరోపించారు. తమకు కూడా పట్టా భూములతో పాటు సమాన ప్యాకేజీ ఇ‍వ్వాలని, రైతు కూలీలకు ఒక్కొక్కరికి నెలకు 9000 పింఛన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అసైన్డ్‌ భూముల రైతుల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

పలువురు రైతులతో పాటు ప్రజా సంఘాల నాయకులను సైతం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన రైతుల్ని ఏ స్టేషన్‌కు తరలించారో అర్థం కాక వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ చుట్టూ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే అన్ని మార్గాలలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు