విభజనపై ఇప్పుడే ఏం మాట్లాడను: విజయ్ కుమార్

29 Oct, 2013 09:52 IST|Sakshi
విభజనపై ఇప్పుడే ఏం మాట్లాడను: విజయ్ కుమార్

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంపై తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడనని కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ తెలిపారు.  రాష్ట్ర విభజన పరిస్థితులపై అధ్యయనం చేయటానికి హైదరాబాద్ వచ్చిన  కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి తొమ్మిది మంది సభ్యుల బృందానికి విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. (పూర్తి కథనం... ఎవరీ విజయ్ కుమార్?)

 

ఈ సందర్భంగా ఆయనను విలేకర్లు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. విభజనపై మిగతావారిని కూడా సంప్రదించిన అనంతరం మీడియాతో మాట్లాడతానన్నారు. రాష్ట్ర విభజన పరిస్థితులపై చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయో తాము చెప్పమలేమన్నారు. అయితే అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని విజయ్ కుమార్ తెలిపారు.

 

శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులు: కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఆ బృందంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్.ఆర్. వాసన్, మధ్యప్రదేశ్ అదనపు డీజీ డి.ఎం. మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అభయ్‌కుమార్, సరిహద్దు భద్రతా దళం ఐజీ సంతోశ్ మెహ్రా, సీఆర్‌పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, హోంశాఖ (పర్సనల్) డెరైక్టర్ శంతను, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐజీ అన్షుమన్ యాదవ్‌లు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు