అధిష్టానం ఆదేశిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ : ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి

4 Jul, 2013 06:31 IST|Sakshi

ఖమ్మం,న్యూస్‌లైన్: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నా రు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిందని చెప్పారు. రా నున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్‌రావు రాజకీయ జిమ్మిక్కులు ప్రదర్శించి ప్రజల మద్ద తు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే రెండు రోజులు దీక్ష చేశారనిఎద్దేవాచేశారు.

ఇళ్లస్థలాలపంపిణీ కోసం కాం గ్రెస్‌పార్టీ ప్రయత్నిస్తోందని, భూమికేటాయిం చిందని అన్నారు. పేదలకు అందకుండా కబ్జాచేసిన భూమిని ఆ వర్గాలకు పంచేందుకు కూడా దీక్షలుచేయాలని అన్నారు. ఎన్నిదీక్షలు చేసినా టీడీపీని ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ విషయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తీసుకు న్న నిర్ణయం హర్షనీయం అన్నారు. తెలంగాణ ప్రక్రియ ముందుకుసాగుతోందని చెప్పారు. ఆయన వెంట నాయకులు రాపర్తిరంగారావు,మనోహర్‌నాయుడు, కట్ల రంగారావు, ఫజల్ తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు