కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కూల్చివేత

24 Sep, 2019 11:22 IST|Sakshi
ఉండవల్లి గ్రామ పరిధిలో కృష్ణా కరకట్టపై అక్రమకట్టడాన్ని తొలగిస్తున్న కార్మికులు

సాక్షి, గుంటూరు, కృష్ణా : తాడేపల్లి మండల పరిధిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నదీ తీరప్రాంతంలో కరకట్ట లోపల నీటి ప్రవాహానికి అడ్డంగా ఏర్పాటుచేసిన ఓ కట్టడాన్ని సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 29 అక్రమ కట్టడాలను గుర్తించి అనేకసార్లు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి  సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో పాతూరు కోటేశ్వరరావు కృష్ణానది లోపలికి చొచ్చుకెళ్లేలా నిర్మించిన కట్టడాన్ని అధికారులు తొలగించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా