ఏపీలో అరకొరగానే రుణమాఫీ

28 Jan, 2019 03:36 IST|Sakshi

వ్యవసాయ రంగ నిపుణురాలు జయతిఘోష్‌  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ అమలు అరకొరగానే ఉందని, రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వ్యవసాయ రంగ నిపుణులు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేటి వ్యవసాయం–ప్రభుత్వ విధానాలు’ అనే అంశంపై విజయవాడ మాకినేని బసవపున్నయ్య  భవన్‌లో ఆమె ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన పాలకులు రూ.1.50 లక్షలకే పరిమితం చేసి అందులోనూ ఇంకా రెండు విడతలు ఇవ్వాల్సి ఉందన్నారు.

ఐదేళ్ల కాలంలోనూ రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడం వైఫల్యం అన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోను వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని జయతిఘోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  గడిచిన మూడేళ్లలో పెరిగిన ధాన్యం ధరలను లెక్కలు గట్టి వ్యవసాయ ఉత్పత్తుల గ్రోత్‌రేటు పెరిగినట్టు చూపడం ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే అవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు