‘ముద్రగడ’ను హేళన చేస్తున్న మంత్రులు

19 Jun, 2016 00:40 IST|Sakshi
‘ముద్రగడ’ను హేళన చేస్తున్న మంత్రులు

తాలూకా కాపు జన సంఘం అధ్యక్షుడు శివయ్య
సత్తెనపల్లిలో రంగా విగ్రహానికి క్షీరాభిషేకం

 
 
సత్తెనపల్లి : కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమాన్ని హేళన చేసే మంత్రులకు పుట్టగతులు ఉండవని సత్తెనపల్లి తాలూకా కాపు జన సంఘం అధ్యక్షుడు ఆకుల శివయ్య అన్నారు. పట్టణంలోని నాగార్జున నగర్‌లో రంగా విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ముద్రగడ నిజాయితీగా చేస్తున్న ఉద్యమాన్ని కాపు మంత్రులు హేళనగా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తానని, గద్దెనెక్కి రెండేళ్లైనా పట్టించుకోలేదని, ముద్రగడ దిక్షకు దిగగానే రూ.వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించారని చెప్పారు.

ఈ కేటాయింపు కాపు మంత్రుల వల్ల కాదన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. కాంట్రాక్టర్ల కోసం పోరాడే కాపు మంత్రులు, కాపు జాతి కోసం పోరాడే ముద్రగడను అవమానించడం సబబు కాదని తెలిపారు. కాపులు ఓట్లు వేస్తేనే గెలిచి మంత్రులు అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు కె.అర్జునరావు, మాదంశెట్టి వేదాద్రి, కొత్తా భాస్కర్, బగ్గి నరహారావు, ఆవుల వెంకటేశ్వర్లు, అంచుల సాంబశివరావు, బి.వేణు, వల్లెం నరసింహారావు, కోటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, నరేంద్ర, తవిటి భావన్నారాయణ, ఆకుల హనుమంతరావు, పి.వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, ఆకుల సుబ్బారావు, ఎ.వెంకట మల్లేశ్వరరావు, చంటి తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు