‘గురువు’గారి గున్నా గున్నా మామిడి

13 Jul, 2019 18:15 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: విద్యార్థుల హుషారు చూడగానే ప్రిన్సిపాల్‌ సారు కుర్రాడు అయిపోయారు. గున్నా గున్నా మామిడి అంటూ హుషారుగా విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రిన్సిపాల్‌పై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. విద్యాబుద్ధులు నేర్పించి హుందాగా మెలగాల్సిన ప్రిన్సిపాల్‌ ఇలా పిచ్చి గంతులు వేయడమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్‌) కాలేజీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. డైట్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తాను రెండేళ్ళు పూర్తి చేసుకున్నందుకు డాక్టర్‌ రంగారెడ్డి ఈనెల 11న వేడుక చేసుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి ఐటమ్‌ సాంగ్స్‌కు డాన్సులు చేశారు. మిగతా అధ్యాపకులు కూడా వీరితో కలిసి చిందులు వేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం సీరియస్‌ అయింది. డీఈవో స్థాయిలో ఉన్న ప్రిన్సిపాల్‌ ఇలా డ్యాన్సులు చేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు