వేధింపులు.. ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్‌..!

13 Jul, 2019 18:10 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ఓ యువకుడు ప్రేమపేరుతో వేధింపులకు గురిచేయడంతో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న మధుశ్రీ అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకె లక్ష్మీనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అతని భార్య స్వగ్రామంలోనే ఉంటూ కూతురు మధుశ్రీని చదివిస్తోంది. ఈక్రమంలో అఖిల్ రాజేష్  జులాయిగా  తిరుగుతూ ప్రేమపేరుతో మధుశ్రీ వెంటపడ్డాడు. పదోతరగతి నుంచే అతని వేధింపులు మొదలయ్యాయి. అయితే ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇద్దరూ మైనర్లు కావడంతో వారి భవిష్యత్ నాశనం అవుతుందనే కారణంగా హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత బాలికను వేరే గ్రామంలోని పాఠశాలలో చేర్పించారు.

పదోతరగతి పూర్తిచేసిన మధుశ్రీ రాజోలు శ్రీచైతన్య కాలేజీలో చేరింది. తాజాగా రాజేష్ మళ్లీ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. బస్సు ఎక్కేడప్పుడు దిగేటప్పుడు నిత్యం వేధిస్తున్నాడు. అతని కారణంగా తల్లిదండ్రుల పరువు పోతోందని భావించిన మధుశ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంటివద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణవార్త విన్న లక్ష్మీనారాయణ గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వదేశానికి తిరిగొచ్చాడు. కూతురు మరణం వెనకున్న అసలు విషయాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక సూసైడ్‌ అనంతరం ‘నన్ను వదిలి వెళ్లిపోయావా’ అంటూ రాజేష్‌ టిక్‌టాక్‌ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టాడు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో దాడి!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు