గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

24 Feb, 2016 15:12 IST|Sakshi

ఏలూరు : చెరువు పూడిక తీస్తూ ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...  ఏపూరి వెంకటేశ్వరరావు (40) ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఆ క్రమంలో బుధవారం శ్రీరామవరంలో చెరువు పూడిక తీయడానికి వెళ్లిన వెంకటేశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... వెంకటేశ్వరరావును ఇంటికి చేర్చారు.  స్థానిక వైద్యుడిని పిలిచేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. వైద్యుడు వచ్చేలోగానే వెంకటేశ్వరరావు మృతి చెందాడు.

మరిన్ని వార్తలు