సర్కారు బడుల్లో సౌకర్యాలు కరువు!

12 Jun, 2018 10:48 IST|Sakshi
ఆరోవార్డులో మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణ దుస్థితి 

నేటి నుంచి పాఠశాలల  పునఃప్రారంభం

విజయనగరం మున్సిపాలిటీ/రూరల్‌ :  నియోజక వర్గంలోని 127 పాఠశాలల్లో అధికారిక లెక్కల ప్రకారం 35 పాఠశాలలకు తాగునీటి సదుపా యం లేదు. మరుగుదొడ్లుకు నీటి సదుపాయం లేని పాఠశాలలు 49 ఉండగా అవి నిరుపయోగంగా మారాయి. 50 పాఠశాలలకు ఆటస్థలం లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. విద్యాభివద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పాలకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో కానరావడంలేదు.

ప్రధానంగా తాగు నీరు, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు లేవు. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా తమకు ఇబ్బందులు తప్పవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు ఉన్నత పాఠశాలలు ఉండగా కస్పా ఉన్నత పాఠశాలలో   తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం కలపి 1300 మంది విద్యార్థులున్నారు.

రెండు గదులు పాడయ్యాయి. వంటగది లేదు. 400 మంది విద్యార్థులున్న  కంటోన్మెంట్‌ ఉన్నత పాఠశాలలో మరుగు సౌకర్యం లేదు. మూడు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. 568 మంది విద్యార్థులు గల బీపీఎం స్కూల్‌లో 12 గదులు పూర్తిగా పాడయ్యాయి. వంటగది లేదు. 

అధ్వానంగా ప్రాథమిక పాఠశాలలు  

గంజిపేట  పాఠశాలలో చికెన్‌షెడ్, వాటర్, ప్రహరీ లేవు. బీసీ కాలనీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేదు. వీటీ అగ్రహారంలో చికె న్‌ షెడ్‌ లేదు. బొండాడ వీధి, ఎస్‌బీటీ మార్కెట్‌ పాఠశాలల్లో మరుగుదొడ్లు పాడయ్యాయి. çకుప్పిలివీధి పాఠశాలలో రెండు గదులు, పుత్సల వీధిలో మూడు తరగతి గదులు పాడయ్యాయి. 

కొత్తగ్రహారంలో మరుగుదొడ్లు,  నీటి సదుపాయం, ప్రహరీ లేవు. కాళ్ల నాయకుడు మందిరం వద్ద పాఠశాలలో ఐదు గదులు పావడగా, టాయిలెట్స్‌ లేవు. అయ్యకోనేరకు గట్టుపై గల పాఠశాలకు  కిచెన్‌షెడ్‌ లేదు. 

సిటీ బస్టాండ్‌ వద్ద పాఠశాలలో రెండు తరగతి గదులు పాడయ్యాయి. ఐదు టాయిలెట్స్‌ పని చే యడంలేదు. బుంగవీధిలో రెండు తరగతి గదులు పాడయ్యాయి. ప్రహరీ, మరుగుదొడ్లు లేవు.వన్‌ప్లస్‌ వన్‌ కాలనీ పాఠశాలకు ప్రహరీ, మరుగుదొడ్లు లేవు. ఆబాద్‌వీధి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. నాలుగు తరగతి గదులు పాడయ్యాయి. 

ఉర్ధూపాఠశాలలో పురాతన గదులు శిథిలావస్థకు చేరాయి. ప్రహరీ కూలిపోయింది. కస్పా ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదులు పాడయ్యాయి. కిచెన్‌షెడ్‌ లేదు.  కొత్తపేట గొల్లవీధిలోని రెండు పాఠశాలల్లో  నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. సాకేటి వీధి పాఠశాలలో మరుగుదొడ్లు  లేవు. 

చిక్కాలవీది పాఠశాలలో కిచెన్‌షెడ్, బాత్‌రూంలు, తరగతి గదులు శిథిలమయ్యాయి. కుమ్మరవీధి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు  నిరుపయోగంగా ఉన్నాయి. రెండు తరగతి గదులు పాడయ్యాయి. నీటి సౌకర్యం లేదు. లంకాపట్నం పాఠశాలలో ఐదు మరుగుదొడ్లు మూలకు చేరాయి. తాగు నీటి సౌకర్యం లేదు. 

పూల్‌బాగ్‌ కాలనీ రెండు తరగతి గదులు పాడయ్యాయి. నందిగుడ్డి పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు లేవు. వైఎస్సార్‌నగర్‌  పాఠశాలలో తాగు  నీరు, వంటగది, ప్రహరీ లేవు. నందివీది పాఠశాలలో వంటగది లేదు. రెండు తరగతి గదులు పాడయ్యాయి.

 ఎస్సీ కాలనీ  పాఠశాలకు  ప్రహరీ లేదు. 

జొన్నగుడ్డి పాఠశాలలో నాలుగు తరగతి గదులు పాడయ్యాయి. ప్రహరీ లేదు. గాడిఖానా ము న్సిపల్‌ పాఠశాలకు భవనం, వంట గది లేదు. రా జీవ్‌నగర్‌ కాలనీ పాఠశాలకు వంటగది,  ప్రహరీ లేవు. లంకవీధి పాఠశాలకు  వంటగది లేదు. మఠం వీధి పాఠశాలలో  వంటగది, ప్రహరీ లేవు.

మరిన్ని వార్తలు