పాఠాలు మేమే చెప్పించుకుంటాం

11 Feb, 2016 01:45 IST|Sakshi
పాఠాలు మేమే చెప్పించుకుంటాం

రేషనలైజేషన్‌లో రామాపురం స్కూల్ మూసివేత, సొంతంగా ప్రారంభించుకున్న జనం
వలంటీర్ సాయంతో వరండాలోనే బోధన
రాజకీయ ఒత్తిళ్లతో మరో రెండు స్కూళ్లు పునఃప్రారంభం
డెప్యుటేషన్ పై సిబ్బందిని నియమించిన డీఈవో

 
రామాపురం పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం 27 వుంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలకు ఐదుగురు పిల్లలు వెళుతున్నారు. వారిని కూడా గ్రామస్తులు ప్రభుత్వ స్కూల్‌లో చేర్చడానికి సిద్ధపడ్డారు. ఇదే విషయం ఎంఈవోతో పాటు కలెక్టర్‌కు కూడా నివేదించామని గ్రామస్తులు తెలి పారు. అయినా  పాఠశాల పునఃప్రారంభంపై స్పందన లేకపోవడంతో గ్రామస్తులే సొంతంగా బడి ప్రారంభించుకున్నారు.
 
 బెరైడ్డిపల్లె : రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వం రామాపురం పాఠశాలను మూసేసింది. పొరుగున ఉన్న పల్లెకు పిల్లలు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా రు. దీంతో గ్రామస్తులే ఏకమై పాఠశాలను బుధవారం ప్రారంభించుకున్నారు. ఇందుకోసం నెలకు రూ. నాలుగు వేలు చెల్లించడానికి నిర్ణయించిన గ్రామస్తులు ఓ వలంటీర్‌ను ఏర్పాటు చేశారు. మూసివేసిన పాఠశాల వరండాలోనే ఆమె పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వుండలంలోని రావూపురంలో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో గత ఏడాది నవంబర్ మొదటి వారంలో పాఠశాలను వుూసివేసి, కిలోమీటరు దూరంలో ఉన్న జవుు్మ గుండ్లపల్లె పాఠశాలలో విలీనం చేశారు. కొంతకాలంగా విద్యార్థులు అక్కడికే వెళ్లి చదువుకునేవారు. ఆ పాఠశాలకు చేరాలంటే రావూపు రం నుంచి రెండు చెరువులు దాటుకుని వెళ్లాలి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు సవుృ ద్ధి చేరింది. వారం క్రితం వుుగ్గురు చిన్నారులు చెరువులోని నీటిలో వుునిగిపోతుంటే, గవునించిన ఆ గ్రామస్తులు కాపాడారు. అప్పటి నుంచి విద్యార్థులు పొరుగున ఉన్న పల్లెలోని పాఠశాలకు వెళ్లాలంటే భయూందోళన చెందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.  

డీఈవోపై ఒత్తిడితో
మండలంలో రామాపురం పాఠశాలతో పాటు మూగ నపల్లె, అలపల్లె స్కూళ్లను కూడా రేషనై లెజేషన్‌లో గత ఏడాది చివరిలో మూసి వేశారు. రామాపురం గ్రామ స్తులు కూడా పాఠశాలల వద్దే నిరసనకు దిగారు. అధి కారులపై వత్తిడి కూడా తె చ్చారు. అయితే స్పందన లేదు. కాగా కొన్ని రాజకీ యంగాప్రత్యేకమైన  పరిస్థితులను మాత్ర మే విద్యా శాఖాధికారులు పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సాక్ష్యం మూగనపల్లె, అలపల్లె స్కూళ్లు తిరిగి ప్రారంభించడా నికి డీఈవో అను మతి ఇచ్చారు. ఆ గ్రామ పాఠశాలలకు ఉపా ధ్యాయులను డిప్యూ టేషన్‌పై నియమించారు.
 
నా దృష్టికి రాలేదు

రామాపురంలో గ్రామస్తులే పాఠశాల ఏర్పాటు చేసుకున్న విషయం నా దృష్టికి రాలేదు. జమ్ముగుండ్లపల్లె  టీచర్ నాకు చెప్పలేదు. పాఠశాలలకు రాని పిల్లల వివరాలు జాబితాలో చేర్చడానికి ఆస్కారం ఉండదు.  రేషనలైజేషన్‌లో గత ఏడాది నవంబర్ మొదటి వారంలో ఆ  పాఠశాలను మూత వేసి కిలోమీటర్ దూరంలోని జంబువాళ్లపల్లెలో కలిపాం. అదేవిధంగా మూతపడిన పాఠశాలల జాబితాలో మూగనపల్లె, అలపల్లె స్కూళ్లు కూడా ఉన్నాయి. డీఈవో ద్వారా అనుమతి తెచ్చుకోవడంతో ఆ పాఠశాలలకు ఉపాధ్యాయులను డెప్యూటేషన్‌పై నియమించాం.
 - సాయిలీల, ఇన్‌చార్జ్ ఎంఈవో, బెరైడ్డిపల్లె
 
 

మరిన్ని వార్తలు