కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్?

20 Jan, 2014 11:58 IST|Sakshi

కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చంద్రయ్య అనే యువకుడు పోలీసుల అదుపులో ఉండగా మరణించాడు. అతడిని పోలీసులే కొట్టి చంపారని చంద్రయ్య బంధువులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం స్టేషన్ పైనుంచి దూకి చనిపోయాడని అంటున్నారు.

చంద్రయ్య కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం బుగ్గారం గ్రామవాసి. ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన చోరీ కేసులో అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా చంద్రయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులకే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.

చంద్రయ్య పోలీసు స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ ఎస్పీ శివకుమార్ తెలిపారు. అతడు బ్యాంకు చోరీ కేసులో నేరం ఒప్పుకున్నాడని, అతడి నుంచి తాము రెండున్నర తులాల బంగారం రికవరీ చేశామని ఆయన చెప్పారు. కేసుకు భయపడే పోలీసులను నెట్టి భవనం పైకెక్కి దూకాడని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు