పూలే చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

29 Nov, 2013 05:55 IST|Sakshi

సిరికొండ,న్యూస్‌లైన్: సామాజిక విప్లవోద్యమ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి అన్నారు. మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో గురువారం నిర్వహించిన పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆనాటి కాలంలో అగ్రవర్ణాలకే పరిమితమైన విద్యను .. అందరికీ పంచేందుకు పూలే చూపిన చొరవ అమోఘమన్నారు. సమాజ మార్పు,  స్త్రీలకు విద్యను అం దించడం కోసం తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి పూలే అని కొనియాడారు. పూలేను గురువుగా భావించిన  అంబేద్కర్ కూడా చదువుతోనే అన్నిం టినీ ప్రభావితం చేయవచ్చని భావించారన్నారు.

అందుకే రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు అన్ని హక్కులు సంక్రమించేలా చేశారని కీర్తించారు. అనంతరం గతేడాది పదో తరగతి, ఇంటర్ మండల టాపర్లకు నగదు పురస్కారం *1116, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందచేశారు.  కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆర్.నర్సయ్య, ఎం ఈఓ సుశీల్‌కుమార్, సర్పంచ్‌లు చిన్నసాయ న్న, సురేఖ, ఠాకూర్ జితేందర్‌సింగ్, రమేశ్, లాలీ, విండో చైర్మన్ గోపాల్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నర్సిం హులు,ఉపాధ్యాయ సంఘ నాయకు లు సాల్మన్,బాలయ్య, రాజేశ్వర్, సత్యానంద్,చిన్ననర్సయ్య పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు