ప్రమాదానికి గురైన మంచు మనోజ్ కారు

8 Dec, 2013 20:51 IST|Sakshi

హైదరాబాద్: నటుడు మంచు మనోజ్ కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద మనోజ్ డ్రైవ్ చేస్తున్న కారు అకస్మికంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మనోజ్ కు స్వల్ప గాయాలైయ్యాయి. ఫిల్మ్ సిటీలోని షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయిన ఒక గేదె ను తప్పించబోయే ప్రయత్నంలో కారు బోల్తా పడింది. ప్రస్తుతం మనోజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, మరి కొద్ది సేపట్లోఇంటికి తిరిగి వస్తాడని తండ్రి మోహన్ బాబు తెలిపారు. మనోజ్ కు స్కానింగ్ తదితర పరీక్షలు జరుగుతున్నాయని అన్న విష్ణు మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు