మెటర్నిటీ ఆస్పత్రి వైద్యుల ర్యాలీ

5 Aug, 2014 01:28 IST|Sakshi
మెటర్నిటీ ఆస్పత్రి వైద్యుల ర్యాలీ
  •     పీజీలు, హౌస్ సర్జన్లు విధులకు దూరం
  •      ఆస్పత్రి వద్ద గర్భిణీల ధర్నా
  • తిరుపతి అర్బన్ : స్థానిక మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల గర్భిణీల భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ ర్లు, భవన నిర్మాణ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలు సోమవారం 6వ రోజుకు చేరా యి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్లు డాక్టర్ పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో రుయా, మెటర్నిటీ వైద్యులతో పాటు పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్లు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ చేపట్టారు.

    మెటర్నిటీ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ర్యాలీని డాక్టర్ భారతి ప్రారంభించగా బస్టాండు సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద ముగిసింది. రుయా, మెటర్నిటీల్లో పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులను బహిష్కరించడంతో వేలాది మంది రోగులు, గర్భిణీలు అవస్థలు పడ్డారు. ఇందుకు నిరసనగా మెటర్నిటీ హాస్పిటల్ ఎదుట పలువురు గర్భిణీలు నిరసన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా కన్వీనర్లు మాట్లాడుతూ సుమారు రూ.100 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించుకున్న భవనాలను పేదలకు కాకుండా ప్రైవేటు చేతుల్లో నిర్వహిస్తున్న స్విమ్స్‌కు అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, సురేష్‌బాబు, గోపీకృష్ణ, విష్ణుభరద్వాజ్, భానుప్రకాష్, ప్రమోద్, మెటర్నిటీ, రుయా వైద్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు