శ్రీధర్‌బాబు రాజీనామా?

2 Jan, 2014 10:16 IST|Sakshi
శ్రీధర్‌బాబు రాజీనామా?

 సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా తనను తప్పించడంపై అసంతృప్తికి గురైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు..  కేబినెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజీనామా పత్రం సమర్పించనున్నారని శ్రీధర్‌బాబు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి తీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేలా ఉందని, ఆ దిశగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా కూడా శ్రీధర్‌బాబు ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
 
 వాస్తవానికి మంత్రి బుధవారమే రాజీనామాకు సిద్ధ మయ్యారు. అయితే సహచర సీనియర్ మంత్రులు జానారెడ్డి, పొన్నాల తదితరులు రాజీనామా చేయొద్దని వారించడంతో కొంత సంశయంలో పడ్డారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరిన తరుణంలో రాజీనామా చేస్తే అసెంబ్లీలో విభజన బిల్లు చర్చపై ప్రభావం చూపుతుందని చెప్పి ఆ మంత్రులు శ్రీధర్‌బాబును బుజ్జగించారు. కానీ శ్రీధర్‌బాబు మాత్రం తన పట్ల సీఎం వ్యవహరించిన తీరును జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
 
 అంతకు ముందు బుధవారం గవర్నర్‌ను కలిసినపుడు శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా అప్పగించిన వాణిజ్యపన్నుల శాఖ బాధ్యతలను చేపట్టేది లేదని స్పష్టం చేశారు. శాసనసభా వ్యవహారాల వుంత్రిగా తాను నిబంధనల ప్రకారమే నడచుకున్నానని, ఎక్కడా తప్పులు చే యులేదని అన్నారు. తన శాఖను సీఎం వూర్చిన విషయుం తెలియుగానే తెలంగాణ సీనియుర్ వుంత్రులకు ఆ విషయుం తెలిపానన్నారు. వుంత్రివర్గం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణరుుంచుకున్నానని, దానికోసం రాజీనావూ లేఖను కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పారు. సమష్టిగా నిర్ణయం తీసుకుందామని, అంతా ఒకేసారి వుుందుకు వెళ్దామని సీనియర్లు చెప్పడంతో వెనక్కి తగ్గానన్నారు. సీఎం చర్యలు తెలంగాణకు వ్యతిరేక సంకేతాలు పంపిస్తాయుని చెప్పారు.
 

మరిన్ని వార్తలు