ఢిల్లీ బాలికపై ఎనిమిది మంది అత్యాచారం

1 Jan, 2014 22:09 IST|Sakshi

ఫరీదాబాద్: ఢిల్లీకి చెందిన ఓ బాలికను ఎనిమిదిమంది దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధితురాలు తన స్నేహితుడిని కలిసేందుకు ఫరీదాబాద్కు వచ్చింది. బల్లాభ్గఢ్ బస్టాండ్లో ఆమె బస్సు కోసం వేచియుండగా, గమ్యస్థానానికి చేరుస్తామంటూ ఐదుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు వారితో జతకలిశారు.

ఎనిమిది మంది కలసి బాలికను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని బస్టాండ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురి నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు