దారి తప్పి లోకేష్ ఏలూరుకు: అబ్బయ్య చౌదరి

31 Oct, 2019 18:29 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: పాదయాత్రలో పామాయిల్ రైతులు తమ సమస్యలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం జగన్‌ వ్యవసాయశాఖ మంత్రిని పంపించి.. దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. గురువారం అబ్బయ్య చౌదరిని దెందులూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ రైతులే ఫ్యాక్టరీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఐదు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యతలో ఆంద్రప్రదేశ్ చివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని చేపట్టామని అబ్బయ్య తెలిపారు.

దారి తప్పి టీడీపీ నేత లోకేష్ ఏలూరు వచ్చి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని మండ్డిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. అప్పుడు అధికారంలో ఉండటంతో చింతమనేనిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అమరావతి అవకతవకలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 35 వేల కోట్ల రుపాయలను ఎన్నికల ముందు లూటీ చేశారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు ఇక్కడి ఆస్తులను కట్టబెట్టాలనుకున్నారని మండిపడ్డారు. చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో అనేక దాడులకు పాల్పడినప్పుడు లోకేష్ ఎందుకు మాట్లాడలేదపని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు.  ఐదు నెలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటూ లోకేష్‌ చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థతిలో లేరని అబ్బయ్య చౌదరి అన్నారు.

>
మరిన్ని వార్తలు