కోస్తా, రాయలసీమకు మోస్తరు వర్షాలు!

1 Dec, 2019 03:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు కోమరిన్‌ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  

తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మరిన్ని వార్తలు