విషాదం: తల్లీ, కుమారుడు మృతి..

21 Mar, 2017 11:54 IST|Sakshi
వత్సవాయి: కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా.. విద్యుదాఘతానికి గురై తల్లీ కుమారుడు మృతిచెందారు. ఈ సంఘటన వత్సవాయి మండలం మాచినేనిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి ఇంద్రాణి(50) ఉతికిన బట్టలను ఇనుప దండెంపై ఆరేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. ఇది గుర్తించిన కుమారుడు వాసు(32) ఆమెను రక్షించడానికి యత్నిస్తుండగా.. అతనికి కూడా విద్యుత్‌షాక్‌ తగలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు