ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

10 Apr, 2020 18:41 IST|Sakshi

సీఎం సహాయ నిధికి మై హోం సంస్థ 3 కోట్ల భారీ విరాళం

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి  మై హోమ్ ఇండస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ కె.రంజిత్‌రావు రూ. 3 కోట్లను చెక్కు రూపంలో సీఎం వైఎస్ జగన్‌కు అందించారు.
(కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్)

ఏపీ సీఎం సహాయనిధికి మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఛైర్మన్ డా. అనిల్‌కృష్ణ సీఎం జగన్‌ను కలిసి రూ.కోటి రూపాయల చెక్కును అందజేశారు. రెయిన్‌ బో హాస్పటల్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ కె.రమేష్ రూ.కోటి రూపాయల చెక్కును సీఎం జగన్‌కు అందించారు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ సి.శ్రీధర్‌ రూ.కోటి రూపాయల చెక్కు సీఎం జగన్‌కు అందజేశారు.
(ఏపీ గవర్నర్ వినూత్న నిర్ణయం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా