సంపద నుంచి చెత్త సృష్టిస్తా.. పప్పులో కాలేసిన లోకేశ్‌

3 Oct, 2018 18:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మంత్రి నారా లోకేశ్‌ మళ్లీ పప్పులో కాలేశారు. హైటెక్‌ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్‌ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లకు హాట్‌ టాపిక్‌గా మారింది.

గాంధీజయంతి సందర్భంగా మంగళవారం ఏపీ ప్రభుత్వం స్వచ్ఛతే సేవ కార్యక్రమం ప్రారంభించింది. చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, దీని కోసం గ్రీన్‌ అంబాసిడర్లను నియమించామని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను నారా లోకేశ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు. చెత్త నుంచి సంపదను సృష్టిస్తామని కాకుండా, సంపద నుంచే చెత్తను సృష్టిస్తామని అందులో పేర్కొనడంతో నెటిజన్లు అవాక్కయ్యారు.

ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘అంబేద్కర్‌ వర్ధంతి శుభాకాంక్షలు..’, ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే.

మరిన్ని వార్తలు