‘దళితులకు నాయ్యం చేసేందుకే ఢిల్లీ నుంచి వచ్చా’

10 Aug, 2018 20:35 IST|Sakshi
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు

సాక్షి, నెల్లూరు : దళితులకు నాయ్యం చేసేందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడలో ఆయన బహిరంగ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి పరామర్శించారు. వారు ఆయన వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబాలు ఆయన ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితవాడలో సుమారు 300 కుటుంబాలుంటే 100 మంది కూడా హాజరు కాలేదంటే పోలీసులు ఎంతగా భయబ్రాంతులకు గురి చేశారో అర్థమవుతోందని అన్నారు. సమావేశానికి కలెక్టర్‌, ఎస్‌పీలు రాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతికి నివేదికను అందజేస్తామని తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పొత్తులపై చంద్రబాబు కీలక సమావేశం

‘కేరళ వరదలను ఆయన రాజకీయాలకు వాడుకున్నారు’

వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌

భోగాపురం నుంచి బాత్‌రూం వరకు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్ తల్లిగా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌

‘సినిమా షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితం’

సొంత బ్యానర్‌లో మరో సినిమా

‘పేపర్‌ బాయ్‌’ ముందే వస్తాడా..?

కేరళ బాధితుల కోసం ‘ఆర్‌ఎక్స్‌ 100’ వేలం

చైతూ సినిమా వాయిదా!